Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపులో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విభాగం జాతీయ మహాసభలకు ఏజెన్సీప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చర్ల, భద్రాచలం మండలాల నుండి ఢిల్లీకి అధిక సంఖ్యలో ఆదివారం విద్యార్థులు తరలివెళ్లారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అలవాల సతీష్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్, దేపంగి రమణయ్య మాదిగలు మాట్లాడుతూ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య కేవలం మాదిగలదే కాదు, భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన సమస్యగా చూడాలని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొప్పుల తిరుపతి మాదిగ, రావులపల్లి ఈశ్వరయ్య మాదిగ, తోకల దుర్గాప్రసాద్ మాదిగ, రవి మాదిగ కోట, ఆకారపు పవన్ మాదిగ, ఆకాష్, సాయి కిరణ్, బాలు, అశోక్, అఖిల, కృష్ణవేణి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.