Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా యుత్ అధ్యక్షుడు డేగల రాముని పవన్ కళ్యాణ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ములకలపల్లి మండలానికి తొలిసారిగా వచ్చినందుకు ములకలపల్లి పవన్ కల్యాణ్ సేవాసమితి సభ్యులు ఈ సన్మానించారు. అనంతరం యూత్ జిల్లా అధ్యక్షులు డేగల రాము మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలని, ప్రతి సమాన్యుడికి జనసేన అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి పవన్ కల్యాణ్ సేవాసమితి అధ్యక్షులు ఇనుకుర్తి రామాచారి, ఎస్కే సుభానీ, ఎస్కే రఫీ పాషా, బచ్చల సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.