Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో రోజురోజుకు పెరుగుతున్న భూ మాఫియాపై గోండ్వానా సంక్షేమ పరిషత్(జి.యస్.పి.) ఆధ్వర్యంలో జరిగే ఉద్యమానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్టు అభ్యుదయ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర పేర్కొన్నారు. ఆదివారం గోండ్వానా సంక్షేమ పరిషత్ బందంతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలంలో భూ మాఫియా విచ్చలవిడిగా పెరిగి, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న స్థాయికి పోయిందని అన్నారు. కొందరు అధికారులు కుమ్మక్కయి ఈ భూ మాఫియా ను పట్టించుకోవడం లేదని అన్నారు. భద్రాచలం రోజురోజుకు పెరుగుతున్న భూ మాఫియా కట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో లు శంకుస్థాపన చేసిన స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురసం. సుబ్బారావు, జి. ఎస్ .పి. కన్వీనర్ సోందె వీరయ్య, జిల్లా అధ్యక్షులు నరసింహారావు, గడ్డం వెంకన్న బాబు, ముక్తి జనార్ధన్, కల్లూరి కొర్రాజు తదితరులు పాల్గొన్నారు.