Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుట్టుచప్పుడు కాకుండా మృత దేహాం తరలింపు?
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని పిమాకిన్ కంపెనీలో ఆదివారం రాత్రి సీనియర్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కార్మికుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్ల మండలానికి చెందిన మోహన్ రెడ్డి (50) కర్మాగారంలోనే మృతి చెందినట్లు తోటి కార్మికులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సంస్థ మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా తన కారులో కార్మికుడి మృతదేహాన్ని బయటకు తరలించనట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన విషయంలో అధికారులు మాత్రం కనీసం స్పందించకపోకం గమనార్హం. ఈ కేసును తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.