Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
కోవిడ్ రూల్స్‌కు లోబడి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఆరు డిపోలలో ప్రయాణికుల సౌకర్యార్థం భద్రత కల్పిస్తుమని, అదేవిధంగా హైయిర్ బస్ ల ఓనర్లు, డ్రైవర్లకు నిబంధనల అమలుపై కచ్చిత ఆదేశాలు ఇస్తూ ఆర్టీసీ సర్వీసులను అందిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం పి.సోలోమాన్ తెలిపారు. సోమవారం ఖమ్మం నూతన బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సూచించారు. ఆర్టీసీ ప్రమాదాలను నివారిస్తూ, ఆదాయ మార్గంలో పయనిస్తున్నట్లు తెలిపారు. మ్యారేజ్ ఆర్టీసీ సర్వీస్ లకు ప్రజాదరణ బాగా పెరిగిందన్నారు. మ్యారేజ్ లకు ఆర్టీసీ బస్‌లను అద్దెకు తీసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఆర్టీసీలో గతంలో 200 కిలోమీటర్లకు గాను పిక్ అండ్ డ్రాప్ ఇది వరకు లేకపోయే, ప్రస్తుతం ఇది అమలుకు రావడం జరిగిందన్నారు. ప్రతి రోజు ఖమ్మం రీజియన్ ఆదాయం రూ.80 లక్షలు వస్తున్నట్లు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 1 నుంచి 10 వరకు స్టడీ చేసే బాలికలకు అదేవిధంగా 1 నుంచి 7 వరకు స్టడీ చేసే బాలురకు ఉచితంగా బస్‌లో ప్రయాణం చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఆర్టీసీలో 1.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. రీజియన్ లో ప్రతిరోజు సర్వీస్‌కు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత బస్ లను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. రీజియన్ పరిధిలో ఉన్న 3025 మంది స్టాఫ్‌కు రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మ్యారేజ్, యాత్రలకు వెళ్లే వారి నుంచి ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అనుభవం గల డ్రైవర్లచే గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో డివిఎం సుగుణాకర్, సిఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.