Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎన్నికలు నిర్వహణలో ఓటు వజ్రాయుధం
అ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు ఈ.శ్రీధర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనదని, ఎన్నికలు నిర్వహణలో ఓటు వజ్రాయుధమని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నియోజకవర్గ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, నాయబ్ తహసీల్దార్లు, బూత్ స్థాయి అధికారులతో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందని చెప్పారు. ఓటరు రికార్డుల నిర్వహణ బావుందని అభినందించారు. ఇప్పటి వరకు అందిన క్లయిమ్స్‌ను డిశంబరు 20వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. సవరణ ప్రక్రియ పూర్తయిన తదుపరి తుది ఓటరు జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి రశీదు పొందాలన్నారు. ఓటర్ల సంక్షిప్త సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులచే పరిశీలించబడిన క్లెయిమ్స్ తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారి ధృవీకరణ చేయాలని చెప్పారు. అనంతరం సూపర్ వైజర్లు ఏఈఆర్ఓల ద్వారా సమర్పించాలన్నారు.