Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పర్మినెంటు మల్టీ పర్పస్ విధానం
రద్దు చేయాలి
అ 20న కలెక్టరేట్ ముట్టడి
జయప్రదం చేయండి
అ జీపీ ఎంప్లాయిస్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
నవతెలంగాణ- కొత్తగూడెం
గ్రామ పంచాయతీ సిబ్బందికి పీఆర్సీ అమలు, కార్మికులను పర్మినెంటు చేయాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 20న కలెక్టరేట్ ముట్టడి చేయనున్నట్లు, జీపీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్నొని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిపి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం సోమవారం కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో చాగంటి వెంకటయ్య మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్లో చెప్పాడని తెలిపారు. చెప్పి 6నెలలు గడుస్తున్న ప్పటికీ ఇంతవరకు అమలుకు పూనుక ొలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, గ్రామ పంచా యతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండ పల్లి శ్రీధర్ నాయకులు శివ కృష్ణ, భరత్, కాపుల రవి, విజరు, కాంతారావు, సీతారాములు, సుబ్బారావు, మంగ, వెంకటలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.