Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే శ్రీథర్ ఆచార్యకు ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివాంగజీవన్-2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా శ్రీథర్ ఆచార్య ఈ అవార్డును అందుకున్నారు. కాగా శ్రీథర్ ఆచార్య 1968-71 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి సంస్కృత పాఠశాలలో నాటి సంస్కృత పండితులు శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల అంతర్వేది నరసింహాచార్య స్వామివారి ప్రస్తుత సంస్కృత పండితులు గుదిమెళ్ల శ్రీమన్నారాయణాచార్యుల తండ్రి వద్ద న్యాయ మీమాంస శాస్త్రములను అథ్యయనం చేశారని ఆయన తెలిపారు. ఎస్టీజీ శ్రీమన్నారా యణాచార్యులు తెలిపారు. అలాగే తిరుపతిలో నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ అధ్యక్షులుగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని, అంతేకాకుండా మా తిరుమల పీఠం నుండి సాంఘిక సేవా సమ్రాట్''గా పురస్కృతిని పొందినట్లు ఆయన పేర్కొన్నారు. అంతటి విశిష్ట వ్యక్తి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.