Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పేరెంట్స్ అందరూ హాజరు కావాలి
అ ప్రిన్సిపాల్ నవీన జ్యోతి
నవతెలంగాణ-గుండాల
నేడు (మంగళవారం) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉదయం 11-00 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని, విద్యార్థి, విద్యార్థినుల తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో అడ్మిషన్లు, హాజరు శాతం పెంచేందుకు మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడడం జరిగిందని తెలిపారు.
అయినప్పటికీ విద్యార్థులను క్రమం తప్పకుండా కళాశాలకు పంపడంలో తల్లిదండ్రుల బాధ్యత తప్పనిసరి అని తెలిపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.