Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
కె.బ్రహ్మా చారి
నవతెలంగాణ-భద్రాచలం
అంగన్ వాడీటీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం వేతనాన్ని 2022 జనవరి నుండి కాకుండా 2021 జూలై నెలనుండి చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మా చారి డిమాండ్ చేశారు. భద్రాచలంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తవేతనం టీచర్‌కి రూ.13650 హెల్పర్, మినీ టీచర్‌కి రూ.7800 జనవరి నుండి చెల్లింటంతో పాటు 2021 జూలైనుండి 2021డిసెంబర్ వరకు ఆరునెల పెరిగిన వేతనం ఎరియర్స్ రూపంలో చెల్లించాలని ఆయన అన్నారు. అలాగే మిని వర్కర్లకు రూ.13,650 వేతనం ఇవ్వాలని ఆమేరకు ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపుదల జిఓను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వీరీద అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, మినిటీచర్లు కార్మిక సంఘాల నేతృత్వవంలో పోరాడి 2018లో టీచర్‌కి రూ.1500, హెల్పర్, మినీ టీచర్‌కి రూ.750 పెంచుకోవటం జరిగిందని ఆయన అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్‌ను బలహీన పరిచి, ప్రైవేటీకరణ చేస్తుంటే, ఆ విధానాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు బలపరుస్తుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ రక్షణ, సమస్యల పరిష్కారంకోసం పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈసమావేశంలో సీఐటీ యూ నాయకులు వెంకట రామారావు, యం.బి. నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, యన్.నాగరాజు, మాధవి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు