Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని అన్నపురెడ్డి పల్లి పరిసర ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్ట్ కాలువలో భూములు కోల్పోయిన గిరిజన, తదితర రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రజావాణిలో రైతులు కలెక్టర్ అనుదీప్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట చేతికి వచ్చిన ఫల సాయం వున్న చెట్లు పోవడంతో రైతులు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. నష్టపరిహారం అందేవిధంగా చూడాలని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా చెన్నారావు ఆధ్వర్యంలో కలెక్టర్ అనుదీప్ కలిసి సమస్యను పరస్కరించాలని కోరారు. యల్యచ్పీయస్ మండల అధ్యక్షులు లాకవత్ రాజు, భూక్యా వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు.