Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
వివిధ రకాల ఆరోపణల నేపథ్యంలో 'అన్నపురెడ్డిపల్లి' గురుకుల విద్యాసంస్థను టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఖమ్మం రీజనల్ కోఆర్డినేటర్ (ఆర్సీవో) కె.ప్రత్యూష సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 'నవతెలంగాణ'లో ఇక్కడి పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై గత బుధవారం 'గురు'కులం'లో కల్లోలం' శీర్షికన కథనం వెలువడిన నేపథ్యంలో ఆర్సీవో ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రిన్సిపాల్ రఫీయుద్దీన్తో మాట్లాడారు. కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా? లేదా?? బోధన తీరుపై తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు.
ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుపోయి సమస్యలు లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఇకనైనా గురు'కుల' సమరానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక సెక్రటరీ రావాల్సి ఉంటుందా? అనే అంశంపై స్థానికంగా చర్చ సాగుతోంది. ఆర్సీవో ఆకస్మిక తనిఖీ విషయం మీడియాకు ముందుగానే లీకవడం అనుమానాలకు తావిస్తోంది.