Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 100 విదేశీ గ్లోబల్ యూనివర్సిటీలకు
తలుపులు తెరిచారు
అ యూజీసీ, ఏఐసీటీఈ స్వయంప్రతిపత్తి
కలిగిన సంస్థలు పూర్తిగా రద్దు..!
అ సదస్సులో ప్రముఖ
విద్యావేత్త ఐవి.రమణారావు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రధాని మోడీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం దేశ విద్యారంగానికి ప్రమాదకరమని ప్రముఖ విద్యావేత్త ఐవి. రమణారావు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సాహితి జూనియర్ కళాశాలలో నూతన జాతీయ విద్యా విధానం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా రమణారావు హాజరై మాట్లాడారు. భారత విద్యా రంగానికి నూతనంగా పరిచయం చేసిన నూతన విద్యా విధానం-2019, పాఠశాల విద్య, ఉన్నత విద్యారంగంలో అనేకమైన మార్పులను సూచిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా ముసాయిదా విద్యార్థుల కు, విద్యాసంస్థలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంద నడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు.
జాతీయ విద్యా విధానం దేశ విద్యారంగానికి ఒక సమగ్రమైన దిక్సూచి లాంటిదని, ఈ దేశ విద్యా వ్యవస్థకు కొన్ని మార్గదర్శకాలతో కూడిన ముసాయిదా అవసరమనే భావన 1964లో ఏర్పడిందన్నారు. దేశంలో ఇప్పటివరకు 3 జాతీయ విద్యా విధానాలు చూసామన్నారు. మొదటిది 1968 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, రెండవది 1986 (1992లో పివీ ప్రధానిగా ఉన్న కాలంలో 2వ ముసాయిదా సవరించారు), మళ్ళీ 34 సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలోనే మూడవది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కస్తూరి రంగూన్ చైర్మెన్‌గా రూపొందించబడిన ముసాయిదా అన్నారు.
100 విదేశీ గ్లోబల్ యూనివర్సిటీలకు తలుపులు
యూజీసీ, ఏఐసిటీ ఈ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను పూర్తిగా రద్దు
అనేక రకాల నూతన సంస్కరణలతో రూపొందించబడిన నూతన విద్యా ముసాయిదాలో అనేక రకాల విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. నూతన ముసాయిదా ఫ్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తూ భారత విద్యావ్యవస్థలోకి 100 విదేశీ గ్లోబల్ యూనివర్సిటీలకు తలుపులు తెరిచి ంది. యూజీసీ, ఏఐసిటీఈ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను పూర్తిగా రద్దు చేస్తూ కొత్తగా వాటి స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌ను పరిచ యం చేసింది. ఈ సంస్థలో ఎవరు సభ్యులుగా ఉంటారనేది స్పష్టం చేయలేదు. ఇటీవలే కేంద్ర విద్యా శాఖ పర్యవేక్షణలోనే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పనిచేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో రాజకీయ నాయకుల జోక్యంతో దీని స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకం కానుందని అన్నారు.
యూజీసీ, ఏఐసీటీఈ వంటి జాతీయ స్థాయి సంస్థలను రద్దు చేయడం, వీటి స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకు రావడంతో కమీషన్లో రా జకీయ నాయకుల జోక్యంతో విశ్వవిద్యాలయాల్లో పరి శోధనా నిధుల దుర్వినియోగం, కొరత తదితర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ప్రస్తుత సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలకు పెంచుతూ మల్టీడిసిప్లనరీ కోర్సులు పెట్టే యోచన
మాజీ జిల్లా పరిషత్ కో ఆప్టెడ్ మెంబర్ నబీ
సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు పెంచారనీ మాజీ జిల్లా పరిషత్ కో ఆప్టెడ్ మెంబర్ నబీ అన్నారు. బహుళ కోర్సులను ప్రవేశ పెట్టాలని ముసాయిదా సూచించిందని, నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మొదటి సంవత్సరం సర్టిఫికెట్ కోర్సుగా, రెండవ సంవత్సరం డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్‌గా, మూడవ సంవత్సరానికి బ్యాచులర్స్ డిగ్రీ, నాల్గవ సంవత్సరానికి పరిశోధనా శిక్షణ డిగ్రీగా డ్రాఫ్ట్‌లో పొందుపరచబడిందని అన్నారు.
కోర్సుల కాల పరిమితిని పెంచడం ద్వారా డ్రాపవుట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దీని గురించి డ్రాఫ్ట్ ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. నూతన విద్యా ముసాయిదాలో భాగంగానే తీసుకొచ్చిన ఎన్టీఏ సంస్థ జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహిస్తూ రిజర్వేషన్లపై పరోక్ష దాడి చేస్తున్నది అందరికీ తెలిసిందే.
ఈ సదస్సులో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాళంగి హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అభిమన్యు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.