Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీజీఎం పర్సనల్ సలగల రమేష్
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా సింగరేణీయులు ఉత్తమ హరిత గృహాల పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీజీఎం పర్సనల్ సలగల రమేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం 2021ని పురస్క రించుకోని సింగరేణి ఆధ్వర్యంలో పి.వి కాలనీ భద్రాద్రి స్టేడియంలో నిర్వహించనున్న వేడుకలలో భాగంగా కానీలలో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగుల కంపెనీ క్వాటర్స్ నందు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఉత్తమ గృహాల కోసం కమిటీ ఆధ్వర్యంలో పర్యటించు నన్నారని ఆయన అన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో కలకళలాడే అత్యుత్తమ మైన ఉద్యోగ గృహాలలో ఎంపికచేసిన వాటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు జీఎం జక్కం.రమేష్ చేతులమీదుగా అందజేస్తామన్నారు. ఉద్యోగులు తమ పేర్లను జీఎం కార్యాలయంలో పర్యవరణాధికారి జీ.శ్రీనీవాసరావు వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. లేదా 9440581438 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.