Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ హాస్టల్స్లో ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.21వేల ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు గూడెపూరి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ గన్యాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. ప్రభుత్వ హాస్టల్స్లో నిత్యం విద్యార్థులకు సేవలందిస్తున్న ఏజన్సీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలేదని వాపోయారు. ఈ ధర్నాలో ఎం.ఉమారాణి, జి.విజయలక్ష్మీ, పి.దయామని, ఎస్కె. మీరాబీ, బి.బుజ్జి, పి.రమణ, బి. వెంకటమ్మ, సిహెచ్. కాంతమ్మ, ఎల్.విమల, ఎం. మంగమ్మ, పి.శ్రీదేవి, ఇ.సరోజా, జి.సమ్మక్క, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.