Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత ఎన్నికల సంఘం మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా క్షేత్రస్థాయిలో ఏటీడీఓ, హెచ్ఎంలు తమ పరిధిలోని ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆప్షన్ ఫారం ఇవ్వవలసిందిగా వత్తిడి చేస్తున్నారని విమర్శించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు సౌకర్యార్థం అప్పీళ్లు/ఆప్షన్ ఫారములు ఏటీడీఏ/హెచ్ఎం కార్యాలయంలో సమర్పించునట్లు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ/ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ గౌతమ్, డీడీ రమాదేవితో చర్చించినట్లు ఆయన చెప్పారు.