Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి మెయిన్ హాస్పిటల్లో కరోనా సెకండ్‌వేవ్ నుండి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు నర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ స్వీపర్స్‌ను టెండర్లు ముగిసిందనే సాకుతో విధుల నుండి తొలగించకుండా కొత్తగా టెండర్లు పిలవాలని, వారిని యధావిధిగా కొనసాగించాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కాంట్రాక్టు సిబ్బంది సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు సిబ్బందిని కరోనా నేపథ్యంలో అన్ని రకాల పనులు చేయించుకొని, విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకొని నేడు మాకు అవసరం లేదని, డ్యూటీలకు రావద్దు అని చెప్పడం సరైంది కాదన్నారు. యధావిధిగా డ్యూటీలోకి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో సింగరేణి మెయిన్ హాస్పిటల్ ముందు, సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.రాము, భాస్కరు, రమణ, సమయ్య, స్టాఫ్ నర్స్, స్వీపర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.