Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సమ్మె విజయవంతం చేసినందుకు కార్మికులకు ధన్యవాదాలు
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని, కేంద్రప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటాలే ఆగేది లేదని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం ఓసి2లో జరిగిన ఫిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికలు 72 గంటల సమ్మెను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, ఫిట్ కార్యదర్శి అశోక్, నాయకులు మల్లికార్జున్, మహబూబ్, శ్రీను, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.