Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పేద జాతుల కోసమే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో సర్కిల్ ప్రారంభించడం జరిగిందని స్వేరో సర్కిల్ జిల్లా అధ్యక్షులు చిట్టిమళ్ల డేవిడ్ రాజు అన్నారు. సోమవారం చింతగుప్ప గ్రామంలో ఇరకం శ్రీను అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా డేవిడ్ రాజు మాట్లాడుతూ పేదల కోసం నిర్మించిన స్వేరో సర్కిల్ అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికం అనే మూడు అంశాల సాధన కోసం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో స్వేరో సర్కిల్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో తుర్రం రాజు, సవలం రత్నకుమారి, శ్యామల, శైలజ, క్రిష్ణ, వెంకటేష్, ధనలకీë, సురేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.