Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాంత చట్టాలను కాలరాసే ప్రయత్నం
నవతెలంగాణ-కామేపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తుందని టిఎస్ టిటిఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాణోత్.వీరునాయక్ అన్నారు. కామేపల్లి మండలపరిధిలోని కొత్త లింగాల లో జరిగిన ఆ సంఘం ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ-ఉపాధ్యాయ అడ్జస్ట్మెంట్ పేరిట జీవో ఎంఎస్ 317ని తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. లోపాలు సవరించకుంటే అడ్డుకుంటామని బాణోత్ వీరు నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవ సింగ్, నరేష్, వీర్య, కిషోర్, శంకర్, లింగ నాయక్, శ్రీను నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు.