Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
టీఆర్యస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి.శేఖర్ బాబు అన్నారు. మధిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 3 సం.లు గడిచిందని, ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మండలం పట్టణ అధ్యక్షులు పుల్లారావు, మల్లాది హనుమంతరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులందరికీ అందుబాటులో వుండేలా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని, ధాన్యం పూర్తిగా కొనుగోలు చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గడ్డం రమేష్, వేల్పుల.కొండ, వాసిరెడ్డి.ప్రకాశరావు, మేడ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు..