Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... అంబేద్కర్ సెంటర్ లో టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం బాణాసంచ కాల్చి, స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రైతు సమితి ప్రతినిధులు డా. లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు మాట్లాడుతూ.... ''స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సారధ్యంలో ఎమ్మెల్సి అభ్యర్థి తాతా మధు గెలుపు కోసం విశేష కృషి చేశారని, నియోజకవర్గం లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అనావాయితిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు యండి. ఇస్మాయిల్, కమ్లి, టిఆర్ఎస్ మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, యూత్ మండల అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, నాయకులు ఉబ్బన వెంకటరత్నం పాల్గొన్నారు.