Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
ప్రజలను పట్టించుకోవాల్సిన పాలకవర్గం విందులు, వినోదాలతో పక్క రాష్ట్రాల్లో కాలం వెళ్లదీస్తూ ఇంకా ఆ మత్తు దిగక ప్రజల్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మధిర పట్టణంలో గత కొంత కాలంగా కొండముచ్చుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని మనుషులపై దాడి చేస్తూ సుమారు 50-60 మందిని గాయపరిచిన మధిర మున్సిపాలిటీ వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలని గాలికి వదిలేశారు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. మధిర పట్టణంలో ఏ వీధిలో చూసినా పందులు, కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయన్నారు. పందుల నివారణకు మధిర మున్సిపల్ పాలకవర్గం చేతులెత్తేసిందన్నారు. పందుల పెంపకం దారులతో లోపాయీకారి ఒప్పందం చేసుకొని పందులను ఊరిమీదకు వదిలేసారన్నారు. ప్రజలను పట్టించుకోవాల్సిన పాలకవర్గం విందులు, వినోదాలతో పక్క రాష్ట్రాల్లో కాలం వెళ్లదీస్తూ ఇంకా ఆ మత్తు దిగక ప్రజల్ని పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీ లో కాలువలు తీసే వారు లేరన్నారు.మధిర పట్టణం, అంబారుపేట, మడుపల్లి ఏ వీధిలో చూసినా గత ఇరవై రోజుల నుంచి చెత్త తీసుకుపోవటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కౌన్సిలర్ మునుగోడు వెంకటేశ్వర్లు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి, కాంగ్రెస్ నాయకులు తలుపుల వెంకటేశ్వర్లు, ఆదిమూలం శ్రీనివాసరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరువీధుల వెంకటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు.