Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ఉభయ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీగా గెలుపొందిన తాత మధుకు టిఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో మంగళవారం ఖమ్మంలో పుష్పగుచ్ఛం ఇచ్చి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ గా టిఆర్ఎస్ అభ్యర్థి గెలవడం శుభపరిణామమన్నారు.
చర్ల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన తాత మధు విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు సోయం రాజారావు మాట్లాడుతూ ఇప్పటివరకు భద్రాచలం నియోజకవర్గలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరికై శ్రద్ధ వహిస్తూ, ఇక్కడి నాయకులకు కార్యకర్తలకు, పార్టీ కార్యక్రమాలకు పెద్దదిక్కుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకముందు కూడా అదేవిధంగా చర్ల మండల అభివృధ్ధికోసం సహాయం చేయవలసిందిగా కోరారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ తాత మధు కూడా మండలానికి అధిక నిధులు కేటాయిస్తూ మండలం అభివృద్ధికి కృషిచేయవలసిందిగా కోరారు. ఆయా కార్యక్రమంలో దొడ్డి తాతారావు, తోట మల్ల వరప్రసాద్, పంజా రాజు చర్ల మండల ఎంపీటీసీలు పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.