Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐటీసీ బంధన్ ఉచిత రుణాలు పంపిణీ
నవతెలంగాణ-చర్ల
చర్ల మండలంలో దారిద్య్ర రేఖకు దిగువన 200 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఐటీసీ బంధన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రుణాలను పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలకు తమ సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే విధంగా సంస్థ ప్రోత్సాహం అందిస్తున్నామని చర్ల బ్రాంచి ఇన్చార్జ్ నాగరాజు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.15 వేల వరకు ఉచిత సాయం చేయటం జరుగుతోందని తెలిపారు. తోపుడు బండ్ల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, కాఫీ హోటల్, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ షాపు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారం కోసం 200 మందికి ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు.