Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం
నవతెంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం ''బేటీ బచావో బేటీ పడావో'' నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం ఆరోపించారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వం ''బేటి బచావో బేటి పడావో'' నిధుల దుర్విని యోగానికి పాల్పడిందనీ, తక్షణమే విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పార్ల మెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2016 నుండి 2019 వరకు ''బేటీ బచావో బేటీ పడావో'' పథకం కోసం రూ.470 కోట్ల నిధులు కేటాయిస్తే 79 శాతం నిధులు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ కేవలం తమ వ్యక్తిగత మీడియా క్యాంపెయిన్ కోసం, ప్రకటనల కోసం నిధులను ఉపయోగించారని ఆరోపించారు. అమ్మాయిల లింగ నిష్పతి ్తపై దృష్టిసారించాలని, పథకానికి కేటాయించిన నిధులను మీడియా ప్రచారానికి కాకుండా, విద్యార్ధినీలకు ఉపయోగపడే విధంగా క్రమబద్ధంగా నిధులను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్యా అభిమన్యు, కళాశాల విద్యార్థి నాయకురాలు సత్య తదితరులు పాల్గొన్నారు.