Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూంర్గంపాడు)
గ్రామపంచాయతీల్లో రోజువారీ చెత్త సేకరణ చేయడం, సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి దాని నుంచి ఎరువును తయారు చేయడం అనేది ప్రతి హరిత రాయబారికి తెలిసి ఉండాలని బూర్గంపాడు ఎంపీడీవో వివేక్ రామ్ అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర్లోని రైతువేదికలో ఐటీసీ వాష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హరిత రాయబారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. అనంతరం ఐటీసీ వాష్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఎంపీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ స్థాయిలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లు, కార్యదర్శి, సర్పంచ్ లందరూ ఈ లక్ష్యాలను సాధించడానికి కృషిచేయాలని, ప్రతిరోజూ చెత్తసేకరణ సమయంలో ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఐటీసీ వాష్, స్వచ్భారత్ మిషన్ ఏపీవో ఆత్రేయ, వాష్ సీసీ వెంకట్రావ్, సందీప్, అన్ని పంచాయతీల ఎంపీడబ్ల్యులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.