Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఉద్యోగల కేటాయింపు విధివిధానాలు సవరించాలని, స్థానికతకు ప్రాధాన్యం లేని ఉద్యోగుల కేటాయింపు సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, రాష్ట్ర కౌన్సిలర్ ప్రసాదరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టీపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అందరికీ న్యాయ సమ్మతంగా ఉండేవిధంగా జీవో నెంబర్ 317ను వెంటనే సవరించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆప్షన్లు ఇవ్వడానికి క్యాడర్ స్ట్రెంత్ కూడా కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 317 దాని విధానాల వల్ల స్థానికతతో సంబంధం లేకుండా సీనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులు నగర పట్టణ జిల్లా కార్య స్థానమునకు సమీపంగా కేటాయించబడతారని అన్నారు. జీవో 317 దాని అనుబంధ విధివిధానాలను సవరించాలని, ఆప్షన్ తప్పనిసరి కాకుండా జిల్లా జోన్లు మారే వారి నుండి మాత్రమే ఆప్షన్లు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాటి సత్తిబాబు, వై.వి.రమణ, బి.మేగ్య తదితరులు పాల్గొన్నారు.