Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎలక్టోరల్ అబ్జర్వర్ శ్రీథర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన ప్రత్యేక కార్యదర్శికి ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్థంభం వద్ద నమస్కరించుకొనిత, గర్భగుడిలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రుని కోవెలను, లక్ష్మి తాయారమ్మ వారి సన్నిధిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి పట్టు వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు వారికి తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత ఐటీసీ పీఎస్పీడీ వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఐటీసీ సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం అధికారులు ఆయనను శాలువాలతో, మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దేవస్థానం ఈఓ బి. శివాజీ, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, భద్రాచలం తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్, బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి, భద్రాచలం ఏటీడీఓ నరసింహారావు, ఇల్లందు ఏటీడీఏ రూపాదేవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.