Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్ పార్టీదేనని భద్రాచలం టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులు అరికెల్ల తిరుపతిరావు అన్నారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా తాత మధుసూదన్ అఖండ విజయం సాధించడంతో భద్రాచలం టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వ ర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా లేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చిట్టి బాబు, నర్రా రాము, జాయింట్ సెక్రటరీ రాజీవ్, అధికార ప్రతినిధి బొల్లా రాంబాబు, సోషల్ మీడియా అధ్యక్షుడు కేజే ప్రేమ్ కుమార్, దిశ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చండ్రుగొండ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధు విజయం సాధించడంతో చండ్రుగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు) ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దారా వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో జెట్పి కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ మాజీ చైర్మన్ మేడా మోహన్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు సూర వెంకటేశ్వర్లు, మండల నాయకులు, దారా రత్నాకర్, చీదెళ్ళ పవన్ బాబు, బాబురావు, చిన్నపిచ్చయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : తాతా మధు గెలిచిన సందర్బంగా మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణా సంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఎంపీటీసీ మడకం రామారావు, ప్రచార కర్యదర్శి కెల్లాశేఖర్, బీసీసెల్ మండల అధ్యక్షులు రంజిత్ కుమార్, నాయకులు రాము, జయసింహ, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : ఎమ్మెల్సీ అభ్యర్ధి తాత మధు గెలుపు పట్ల మంగళవారం మర్యాదపూర్వకంగా ఖమ్మంలో వారి స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు దుద్దుకూరి సుమంత్ కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.
మణుగూరు : ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపు పట్ల ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టీఆర్ఎస్ పార్టీ అని మరోసారి రుజువైంద న్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమాను లు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.