Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఎంఎల్సీగా తాతా మధు గెలిస్తే101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటానని టిఆర్ఎస్ జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్ మొక్కిన మొక్కుకు ఎమ్మెల్సీగా తాత మధు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. మొక్కిన మొక్కులో భాగంగా మండలపరిధిలో వెంకటాపురం రామాలయంలో మంగళవారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి మంగళవారం 101 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ బిసిసెల్ మండల అధ్యక్షుడు తోట ధర్మారావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బంక మల్లయ్య, వీరనారాయణ పాల్గొన్నారు.