Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోరీ యత్నంలో పాల్గొన్నది నలుగురు
- పురుషులు, ఇద్దరు మహిళలు
నవతెలంగాణ-బోనకల్
మండల కేంద్రంలోని నవ దుర్గాదేవి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... స్థానిక సాయిబాబా కళ్యాణమండపం ఆవరణలో ఇటీవలే నవ దుర్గాదేవి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఆలయానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ దొంగలు నవ దుర్గాదేవి ఆలయానికి గల తాళాలను కోసి హాలులోకి ప్రవేశించారు. హాలు లో గల ఇనుప హుండీ ని అతి కష్టం మీద ఆరుగురు దొంగలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు.హుండీని తీసుకెళ్లకుండా రోడ్డుపై పడవేసి వెళ్ళటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హుండీ అధిక బరువు ఉండటం తో వదిలి వేసి వెళ్లి ఉండవచ్చునని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. హుండీని మాత్రం పగలగొట్టు లేదు. గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులు రాగా నవ దుర్గా దేవి ఆలయం ఎదురుగా రోడ్డుపై హుండీ కనిపించింది. ఆ తర్వాత నవ దుర్గా దేవి ఆలయం వద్దకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో అర్చక లు దేవాలయ నిర్వాహకులకు సమాచారం అందజేశారు. సాయిబాబా దేవాలయ కమిటీ చైర్మన్ సూర్యదేవర రామ్మోహన్ రావు ఇతర కమిటీ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. సి సి ఫుటేజ్ లో చోరీలో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీలు పాల్గొన్నట్లు కనిపించింది. ఆటో ని తీసుకువచ్చి నవ దుర్గాదేవి ఆలయం ముందు ఉంచారు. ఆలయం తాళం కోసి లోనికి ప్రవేశించారు. ఆలయంలో గల హుండీని బయటకు తీసుకు వచ్చి ఆటోలో పెట్టేందుకు విశ్వప్రయత్నం చేయగా ఫలించలేదు. పైగా జనం తాకిడి తగలటంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆలయ కమిటీ చైర్మన్ సూర్యదేవర మోహన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ తేజావత్ కవిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.