Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజరు దివస్ కార్యక్రమంలో భాగంగా ఉక్కు మహిళ, భారతరత్న మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్ర పటానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పూల మాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, మాజీ శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల ఎంఎల్సి గా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,ఖమ్మం నగర కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, మద్దినేని రమేష్, సయ్యద్ హుస్సేన్, ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటయ్య, తూములూరి లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.