Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రెజొనెన్స్ విద్యార్థులు రాష్టస్థాయిలో ఎక్కువ మంది మొదటి 10 స్థానాలలో నిలిచారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్స్ ఆర్.వి.నాగేంద్రకుమార్ మరియు కె.శ్రీధర్‌రావులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆన్లైన్ విధానంలో బోధన జరిగినప్పటికీ అత్యంత కఠినమైన కరోన విపత్కర పరిస్థితులలో కూడా రెజొనెన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ఆధిక్యాన్ని చాటుకుని ఆన్లైన్ అయిన ఆఫ్‌లైన్ అయినా రెజొనెన్స్‌కి తిరుగులేదని మరొకసారి రుజువు చేసారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించడానికి పఠిష్టమైన ప్రణాళిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, బోధనానుభవం కలిగిన మేనేజ్మెంట్ ఈ విజయానికి కారణమని తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఈ సంధర్భంగా అభినందించారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తమ విద్యార్ధులు సాధించిన మార్కులు ఎ.వినరు 466, వి.క్రాంతికుమార్ 464, డి.గురుసాయి 464, యం. ఉమేష్ నందన్ 463, యం.డి. ఇస్మాయిల్ అహ్మద్ 463, యం.డి. షావర్ అక్తర్ 462, డి. వర్షిత 462, జి.ఉదరు కృష్ణారెడ్డి 461, కె.భరత్ 461, ఆర్.రవికుమార్ 461, వి.మోక్షదత్త 460వీరితో పాటు ఎంపీసీలో 460 మార్కులు దాటిన విద్యార్థులు 52 మంది పైగా ఉండటం విశేషమన్నారు.
జూనియర్ బైపీసీ విభాగంలో కె.జ్ఞానప్రసన్న 430, యం.భానుశ్రీ 429, కె.కావ్య 428, బి.పవిత్ర 426, జె.భానుశ్రీ 426, కె.రవికుమార్ 426, జి. ఓజస్విని 424లతో పాటు 420కి పైగా మార్కులు సాధించిన విద్యార్ధులు 30 మందికి పైగా ఉన్నారన్నారు.. ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి చక్కటి ప్రణాళికాబద్దమైన నిర్ణయాలు తీసుకొనడం వలన మాత్రమే ఇది సాధ్యమైనదని ఈ సందర్భంగా తెలిపారు.
జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో సైతం అద్భుతమైన ఫలితాలని సాధిస్తూ ఒక విలక్షణమైన విద్యాక్షేత్రంగా వెలుగొందుతూ తన ప్రతిభను చాటుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ వి.సతీష్, భాస్కర్‌రెడ్డి, రాంబాబు, రాధిక, శాంతి అధ్యాపకులు పాల్గొన్నారు.