Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఇంటర్మీడిియట్ పరీక్షా ఫలితాలలో నగరంలోని న్యూ విజన్ జూనియర్ కళాశాల ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను 466 మార్కులు, బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను 436 సాధించి స్టేట్ టాపర్గా నిల్చిందని కళాశాల ఛైర్మన్ సి.హెచ్.జి.కె. ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ విభాగంలో వరుసగా నలుగురికి 466, ముగ్గురికి 465, 465, 465, 14 మందికి 464 బైపీసీ విభాగంలో 436, 435, ఇద్దరికి 434, ముగ్గురికి 433, 433, 433, ఇద్దరికి 431 మార్కులు సాధించారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో మోత్కూరి లోహిత శ్రీ 466, బాణాల నిఖిల్ 466, వేములపల్లి రుత్విక్ 466, మన్నేపల్లి సాయి వర్షిత్ 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కె.సరోజిని 436 మార్కులు సాధించింది.
తమ కళాశాల జె.ఇ.ఇ. మెయిన్స్ -2021 పోటీ పరీక్షల్లో ఆల్ఇండియా మొదటిర్యాంకు సాధించిందని, పరిమిత సంఖ్య విద్యార్దులతో ఐఐటి, జెఇఇ. మెయిన్స్, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో ఆల్ఇండియా ఉత్తమ ర్యాంకులు సాధించి టాప్-10 ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి., మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ సి.హెచ్.జి.కె. ప్రసాద్, డైరక్టర్ సిహెచ్.గోపిచంద్ అభినంధించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ మాధవరావు గారు, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు మరియు అధ్యాపకబృందం పాల్గొని అభినందించారు.