Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు అన్ని విభాగాలలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం మార్కులతో మనిషా 467, పీ.స్వాతి 466, వి.సౌమ్య 465, పూజిత 465, రిచిత 465, సీహెచ్. తేజశ్రీ 465, జోస్న 465, టి.పల్లవి 465 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో టి.రోషిని 434,డి. సిందూ 434, షేక్ వహిద 434, పూజిత 434, గుండ్ల వర్షిణి 434, జి.కిరణ్ మై434, అవినాష్ 433, అఖిల433 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో బి.దీప్తి 488 మార్కులు, పివిఎన్.సిద్ధర్ధ 487, జూనియర్ సీఈసీ విభాగంలో ఎస్కె.హబీబ్ 479, కె. చైత్ర 470, ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో టాప్ మార్కులతో నిలిచారు.
వివిధ విభాగాలలో సాధించిన మార్కుల వివరాలు
జూనియర్ ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించిన వారు ఒకరు, 466 మార్కులు సాధించిన వారు ఇద్దరు, 465పై మార్కులు సాధించిన వారు 12 మంది, 464పై మార్కులు సాధించిన వారు 38 మంది, 463పై మార్కులు సాధించిన వారు 67 మంది, 460పై మార్కులుసాధించిన వారు 146, బైపీసీ విభాగంలో 430పై మార్కులు సాధించిన వారు 21 మంది, ఎంఈసీవిభాగంలో 430 మార్కులు సాధించిన వారు 48మంది, సీఈసీ విభాగంలో 430 మార్కులు సాధించిన వారు 50 మంది ఉన్నారు. ఎంఈసీ, సీఈసీ విభాగాలో కూడా జిల్లా స్థాయిలో టాప్ మార్కులతో నిలిచారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇటు ఇంటర్‌తో స్టేట్ మార్కులతో అటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో ఆలిండియా 10లోపు, 100 లోపు సైతం ర్యాంకులు సునాయసంగా సాధిస్తూ తెలంగాణ ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేస్తున్నారని తెలిపారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మెన్ మల్లెంపాటి శ్రీదర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్స్ సాయిగీతిక, సీహెచ్ చేతన్ మాధుర్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు.