Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆప్ బ్యాంక్ యూని యన్స్ (యూయఫ్బీయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె బాటు పట్టారు. గురువారం భద్రాచలం చర్చి రోడ్లో కల ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్సీబీఈ కార్యదర్శి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంక్‌ల ప్రయివేటీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రమణ, రామ య్య, శరత్, శ్రీను, అనీఫ్, రామకృష్ణ, సుబ్బారావు, గౌత మి, సునీత, దివ్య, రమ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం), సీఐటీయూ సంపూర్ణ మద్దతు సమ్మె ప్రారంభం సందర్భంగా పాల్వంచ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, పాల్వంచ పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, పాల్వంచ పట్టణ మండల కన్వీనర్ గూడెపూరి రాజు మాట్లాడారు. ప్రభుత్వరంగ బ్యాంకులను రక్షించుకోవటం బాధ్యత మనందరిపై ఉందన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు, పాల్వంచ పట్టణ కార్యదర్శి వి.వాణి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు, పాల్వంచ పట్టణ అధ్యక్షురాలు కే.సత్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం.రాములు, బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీను సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ ధర్నాలో బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి, సైదులు, కృష్ణఅర్జున్, కావ్య శ్రీ, వివిధ బ్యాంకుల ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : బ్యాంకులను ప్రయివేటీకరిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఉండవని యూనిటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మెలో భాగంగా మొదటిరోజు సమ్మె విజయవంతమైంది. గురువారం బ్యాంకు ఉద్యోగులు అంబేద్కర్ సెంటరు నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు.