Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటికీ కేసీఆర్ గ్రామ గ్రామానికీ టీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభం
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ-కరకగూడెం
ఏజెన్సీలో విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల పరిధిలోని భట్టుపల్లి వీరాపురం క్రాస్ వద్ద రూ.3కోట్ల 33లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా నూతన విద్యాలయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గురువారం ప్రారంభించారు. అనంతరం భట్టుపల్లి, కొత్తగూడెం గ్రామల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికీ కేసీఆర్ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ప్రజలు రేగాకు పూలదండలు వేసి బ్రహ్మరధం పెట్టారు. ఈ సందర్భంగా రేగా ప్రజల సమస్యలపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడారు. పలు గ్రామల్లో పలు చోట్ల సీసీ రోడ్డులను శంకుస్థాపన చేశారు. సమత్ మోతె సర్పంచ్ ఇర్ప విజరు కుమార్ తండ్రి సత్యం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రేగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, ఎంపీపీ రేగా కాళిక, పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, ఆత్మ డైరెక్టర్ కొంపెల్లి పెద్దరామలింగం, సొసైటీ డైరెక్టర్ కనకయ్య, ముఖ్య నాయకులు వెంకట్ రెడ్డి, భవానీ శంకర్, రాంబాబు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.