Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
మహిళలు స్వయం ఉపాధి శిక్షణ ద్వారా ఆర్థిక అభివద్ధి సాధించాలని ఎంపీడీవో ఎం చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని చెరువుమాదారం గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం సహకారంతో జాగతి యువతీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు నెలల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ శిక్షణ పట్ల పట్టుదలతో పనిచేస్తూ మంచి నైపుణ్యాలను సాధించాలని సూచించారు. తద్వారా స్వయంసమద్ధి సాధిస్తూ మరో పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పగిడి పత్తి శ్రీనివాసరావు, జాగతి యువతి మండలి అధ్యక్షురాలు పగడాల కళ్యాణి, జక్కుల వెంకటరమణ, నాన్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాధవి, రవి, ఎన్ వై కె వాలంటీర్ సుధీర్, టైలరింగ్ టీచర్ యోహాన్ తదితరులు పాల్గొన్నారు.