Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉద్యోగుల విభజన, స్థానికత ప్రక్రియను పరిశీలిచేందుకు నియమించిన ఉద్యోగుల విభజన ప్రక్రియ జిల్లా ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, యూనియన్ సభ్యులు గురువారం సాయంత్రం కలిశారు. పుష్ప గుచ్ఛం అందించారు. ఉద్యోగులు కేటాయింపు లొ ఎవ్వరికీ ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. సీనియారిటీ ప్రాతిపదికన న్యాయం చేకూర్చే విధంగా కేటాయింపు చేయాలని విన్నవించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగుల విభజన ప్రక్రియలో కౌన్సెలింగ్లో ఉద్యోగ సంఘాలకు ప్రాధాన్యత నివ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. బదిలీల్లో ఉద్యోగ సంఘాలను సైతం కీలకంగా చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయించడం అభినందనీయమని టి.ఎన్.జి.ఓస్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ అఫ్టల్ హసన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యలను విన్నవించడంతో సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా చేస్తున్న కౌన్సిలింగ్ కు ఉదోగ్య సంఘాల్లోని యూనిట్, తాలూకా, ఫోరం అధ్యక్ష, కార్యదర్శులకు ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అటవీ శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాల్లో పలువురు ఉద్యోగులను ఇతర జిల్లాలకు పంపించగా వారిని యథావిధిగా ఇక్కడే విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ అడహక్ కమిటీ కన్వీనర్గ అఫ్టల్ హసన్, సభ్యులు వల్లోజి శ్రీనివాసరావు, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం సభ్యులు శ్రీనివాస రెడ్డి, ఖాజామియా, నాల్గవ తరగతి సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.