Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశానుసారం టీఆర్ఎస్ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అంజనాపురం పంచాయతీలో గురువారం ఇంటింటికీ కేసీఆర్...గ్రామగ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమాన్ని టీఆర్యస్ పార్టీ నాయకులు చేపట్టారు. ఇందులో భాగంగా నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రతి కుటుంబానికి అందుతున్నాయో..లేదో అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషిచేసేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పర్యటనలో భాగంగా ఆసరా ఫింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు తదితర పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రజలకు ఈసందర్భంగా వివరించారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, నాయకులు బెల్లంకొండ రామారావు, మహిళా మండలి అధ్యక్షు రాలు ఎల్లంకి లలిత, అంజనా పురం సర్పంచ్ భూక్యా భారతి, ఉపాధ్యక్షులు బండారు లక్ష్మి నారాయణ, వారాల వేణు, పొడియం నరేందర్, గ్రామకమిటీ అధ్యక్షుడు బానావత్ శ్యామ్, బాలి శ్రీహరి, సయ్యద్ అలీ, కరీం, గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, వీరభద్రం, మునావత్ ముని, లకావత్ వెంకటేశ్వర్లు, సీతారాములు, లకావత్ వాల్యా, వార్డుసభ్యులు భూక్యా నాగ, తేజావత్ రాము, బోడా గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.