Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కేవలం ముస్లింల సమస్య కాదు యావత్ దేశ ప్రజల సమస్య
- కొత్తగూడెం ధర్నా చౌక్‌లో ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నల్ల చట్టాలు రద్దు చేయాలని, నల్ల చట్టాలపై పోరాటం ఆగలేదని, రద్దు చేసే వరకు పోరాటల ఆగదని, ఇది కేవలం ముస్లింల సమస్య కాదని, ఇది యావత్ దేశ ప్రజల సమస్యఅని కొత్తగూడెం ధర్నా చౌక్‌లో ఆందోళన కారులు స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్దగల ధర్నా చౌక్‌లో షాహీన్ బాగ్‌లో మహిళా ఉద్యమానికి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు గురువారం ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు, పురుషులు అన్ని పార్టీల నాయకులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ తెచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ముక్త కంఠంతో నినాదాలు చేశారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాసాని అయిలయ్య, ఎస్కే. షాబీర్పాష, నయీమ్ ఖురేషి, జావిద్ సాఠే, అబిద్ హుస్సేన్, సమద్, మల్లికార్జున్, ఉమర్ ఫారూఖ్, సాబీర్ పాషా, కురిషె రత్న కుమారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి కృష్ణ, తోట దేవి ప్రసన్న, వై.శ్రీనివాస్ రెడ్డి, పర్వీన్, అన్వర్ పాషా, షాఉద్ రజా, షెహేనాజ్ జహంగీర్, జయంతి మసూద్ తదితరులు పాల్గొన్నారు.