Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొణిజర్ల
మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సూరంపల్లి రామారావు అద్వర్యంలో రైతులు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ దోడ్డారాపు సైదులుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూరంపల్లి రామారావు మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొణిజర్లలో ఎంతో మంది రైతులు కల్లాలలో తమ ధాన్యాల పోసుకుని కొనే దిక్కులేక దళారులకు అమ్ముకుని మోసపోతున్నారని మేజర్ గ్రామ పంచాయతీలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా రాజకీయం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఖాళీ సంచులు సరఫరాలో కూడా అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే కొనిజర్ల లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నెల్లూరు రమేష్, కొణిజర్ల యంపిటిసి కొనకంచి స్వర్ణలత, శాంతకుమార్, రాయల భద్రయ్య, గుడివాడ వెంకటేశ్వర్లు, కోడుమూరు వెంకటేశ్వర్లు, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.