Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-బోనకల్
పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక నిర్బంధాలు, దాడులు ఎదుర్కొంటూ ముందుకు సాగిన మహా యోధుడు పెంట్యాల మల్లయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కొనియాడారు. మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో పార్టీ మాజీ శాఖ కార్యదర్శి మల్లయ్య సంతాప సభ కృష్ణా జిల్లా వత్సవాయి సిపిఎం మాజీ మండల కార్యదర్శి మండెపూడి చంద్రశేఖర అధ్యక్షతన గురువారం జరిగింది. తొలుత మల్లయ్య చిత్రపటానికి పోతినేని సుదర్శన్ రావు ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు యన్సిహెచ్ శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ మల్లయ్య ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన వారని, అక్కడ అ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలపై జరిగిన అనేక పోరాటాలలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. జీవితాంతం పేద ప్రజల సమస్యల కోసం, నమ్ముకున్న పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. 20 సంవత్సరాల క్రితం బోనకల్ మండలం జానకీ పురం గ్రామం వచ్చి స్థిరపడ్డారని అన్నారు. జానకిపురం సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా మూడు సార్లు పని చేశారన్నారు. బోనకల్ మండలం కమ్యూనిస్టుల పోరాటాల పురిటిగడ్డ అని ఆ పోరాటాల పురిటి గడ్డ పై జరిగిన అనేక పోరాటాలలో కార్యకర్తగా పాల్గొన్నాడని కొనియాడారు. మల్లయ్య కృష్ణా జిల్లా జగ్గయ్యపేట డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన కాలంలో జరిగిన అనేక పోరాటాలలో పాల్గొన్నాడని తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీలో పని చేయడం అంటే ముళ్ళ బాట మీద ప్రయాణమే : సీపీఐ(ఎం) కృష్ణ్ణా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు
కమ్యూనిస్టు పార్టీలో పని చేయడం అంటే ముళ్ళ బాట మీద ప్రయాణం చేయడమేనని ఆ విధంగా పెంట్యాల మల్లయ్య పనిచేశారని ఆంధ్రప్రదేశ్లోని సీపీఐ(ఎం) కృష్ణా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యన్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో మల్లయ్య అనేక పోరాటాలలో పాల్గొని యువతకు, పార్టీకి మార్గదర్శిగా పని చేశారని కొనియాడారు. ఈ సంతాప సభలోకష్ణా జిల్లా జగ్గయ్యపేట సిపిఎం మాజీ డివిజన్ కార్యదర్శి చిరుమామిళ్ళ హనుమంతరావు, సిపిఎం వత్సవాయి మండల కార్యదర్శి తమ్మినేని రమేష్ జగ్గయ్య పేట డివిజన్ నాయకులు నెల్లూరు మాధవరావు, తమ్మినేని రాంబాబు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎనమద్ది సత్యనారాయణ, పెద్ద బీరవల్లి సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, సిపిఎం బోనకల్ మండల కమిటీ సభ్యులు గూగుల్ లోతు నరేష్, పెదప్రోలు కోటేశ్వరరావు, కిలారి సురేష్, చిట్టి మోదు నాగేశ్వరరావు, సిపిఎం జానకిపురం శాఖ కార్యదర్శి కుక్కల కోటేశ్వరరావు, సిపిఎం మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య, సిపిఎం జానకిపురం మాజీ శాఖ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.