Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న మిర్చి పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూరు)
మిర్చి సాగు చేస్తున్న రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన మిర్చి పంటను సర్వే చేసి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి దొంతెబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రాయమాదారం, మర్సకుంట సూర్యతండ, శ్రీరాంపురంతండా, తిమ్మారావుపేట తదితర గ్రామాల్లో సిపిఎం బృందం దెబ్బతిన్న పంటలను గురువారం పరిశీలించారు. రైతులు ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట రోగాల బారిన పడి అప్పులు మిగిలాయని, ఇప్పటివరకు దెబ్బతిన్న పంటల వైపు కనీసం ఏ అధికారి, ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడలేదని కన్నీరు పెట్టుకుంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న మిర్చి రైతులందరు ఈ నెల 20న ఖమ్మంలో మిర్చి రైతుల మహా ప్రదర్శన కలెక్టర్ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, రైతు సంఘ నాయకులు గుండా సత్యనారాయణరెడ్డి, ఏర్పుల రాములు, షేక్ జానీ, కాలసాని కృష్ణయ్య, రైతులు ధరావత్ రాందాస్, రాంబాబు, ధరావత్ రాములు, భూక్యా రాములు, లక్ష్మణ్ శ్రీను మంగ్యా , జగన్, సురేష్ జ్యోతి, స్వాతి పాల్గొన్నారు.