Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసర్పంచ్ వినతికి స్పందించిన కలెక్టర్
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో నిర్మాణం ఆగిపోయిన ఇల్లందు - డోర్నకల్ డబల్ బీటీ రోడ్ విషయం, గాజులతండా వద్ద స్పీడ్ కోసం గుట్టకిందిగుంపు ఉపసర్పంచ్ ఎస్కే.ఉషాగౌస్పాషా ఆధ్వర్యంలో గాజులతండా గ్రామస్తులు జిల్లా కలెర్టర్కు ఇచ్చిన వినతిపై కలెక్టర్ స్పందించారు. వెంటనే గాజులతండా వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుతో పాటు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈనెల 7వ తేదిన మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ వీపీ గౌతమ్‌కు ఉపసర్పంచ్ ఎస్కె.ఉషాగౌస్పాషా కారేపల్లి - ఇల్లందు రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలు, మూడెండ్లు గడుస్తున్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయక పోవటంతో నాసిరకం పనులపై పిర్యాదుచేశారు. దీనిపై ఆర్ అండ్ బీ అధికారులల్లో కదలిక వచ్చింధి. వెంటనే గాజుతండా వద్ద స్పీడ్ బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మూల మలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉపసర్పంచ్ తెలిపారు. నిర్మాణం మధ్యలో ఆగిన రహదారి పనులు కూడా ప్రారంభం అయ్యాయన్నారు. వినతికి స్పందించిన కలెక్టర్ ఉపసర్పంచ్ ఉషాగౌస్పాషా, టీఆర్ఎస్ మైనార్టీ ప్రదాన కార్యదర్శి గౌసుపాషా, గ్రామస్తులు దస్తగిరి, ఎండీ. ఖాసీంఖాన్, పాషా, యాకూబ్, ఘనీ, నబీ తదితరులు పాల్గొన్నారు.