Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంచలనంగా మారిన అన్నపురెడ్డిపల్లి గురుకుల టీచర్ ఆత్మహత్య
- కొనసాగుతున్న విచారణ...ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు
- వారితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుని సస్పెన్షన్
- మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సంఘాల డిమాండ్
- డబుల్బ్రెడూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. కలెక్టర్ హామీ
నవతెలంగాణ- అన్నపురెడ్డిపల్లి
అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఆత్మహత్య ఉదంతం సంచలనంగా మారింది. పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న కళ్యాణి (26) గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ రొనాల్డ్‌రోస్ ఆదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ శారద విచారణ నిర్వహిస్తున్నారు. కళ్యాణి ఆత్మహత్యకు కారకులుగా భావిస్తున్న తెలుగుటీచర్ మన్మథరావు (ఏ1), ఆర్మీ ఉపాధ్యాయుడు భానుప్రకాశ్(ఏ2)పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. గురుకుల సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ రఫీయుద్దీన్‌ను విచారణ అధికారి శారద సస్పెండ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏ1 మన్మథరావు, మృతురాలు కళ్యాణితో కలిసి గదిలో ఉండగా ఏ2 భాను ప్రకాశ్ ఆ రూమ్ దగ్గరకు వెళ్లి ఫొటోలు తీసినట్లు చెబుతు న్నారు. దీంతో ఆందోళన, మనస్తాపానికి లోనైన కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వివాహితుడైన మన్మథరావు గతకొంతకాలంగా కళ్యాణిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు ఉపాధ్యా యులు కళ్యాణిని బెదిరిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
వివిధ సంఘాల ఆందోళన
అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాల ఆత్మహత్య ఉదంతం తెలిసిన వెంటనే వివిధ సంఘాలు ఆందోళనలు నిర్వహి ంచాయి. గురుకుల పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ, స్వేరోస్ ఆందోళన నిర్వహించగా కొత్త గూడెంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, తుడుందెబ్బ, పీడీఎస్‌యూ ఆందో ళన చేపట్టాయి. కుటుంబానికి న్యాయం చేయాలని డిమా ండ్ చేశాయి. డబుల్ బెడ్రూం ఇంటితో పాటు రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం సమర్పించాయి. ఈమేరకు ఆయన స్పందిస్తూ డబుల్బెడ్రూం ఇంటితో పాటు కుటుంబంలో ఒకరికి గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.50లక్షల పరిహారం విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అభ్యంతరకరంగా అన్నపురెడ్డిపల్లి
పాఠశాల ఉపాధ్యాయుల తీరు
అన్నపురెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై పలు ఆరోపణలున్నాయి. దీనిపై ఈనెల 8వ తేదీన ఓ కథనం వెలువడింది. 13వ తేదీన ఖమ్మం ఆర్సీవో ప్రత్యూష పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులతో మాట్లాడారు. అయినా ఇక్కడి ఉపాధ్యాయుల తీరులో మార్పు రాలేదు. ఆర్సీవో సందర్శించి పట్టుమని మూడురోజులు కాకముందే గురువారం రాత్రి ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. కొందరి అండతోనే ఇక్కడి ఉపాధ్యాయులు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసా గుతున్న విచారణలోనూ క్రమశిక్షణ లేకుండా ఇష్టాను సారంగా వ్యవహరించే కొందరు టీచర్లను కాపాడే ప్రయ త్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారికి అనుకూలంగా రిపోర్టు తయారవుతున్నట్లు సమాచారం.