Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా
- కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన జేఏసీ
నవతెలంగాణ-కొత్తగూడెం
మున్సిపల్ కార్మికులకు జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు డిసెంబర్ 17వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పెరిగిన పీఆర్సీ ప్రకారం మున్సిపాలిటీ కార్మికులకు రూ.19వేల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టర్ అనుదీప్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.19 వేలు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, జిపిఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటియూ)జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికులను వివక్షకు గురిచేస్తూ, 11వ, పీఆర్సీ ప్రకారం వేతనాలు కాకుండా కొత్తగా, జీఓ.60ని తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసిన కూడా కార్మికులు కనీస వేతనం కోసం (రూ.15600,-రూ.19500, రూ.-22750) అమలు చేయాలని 6 నెలల నుండి ఎన్నో పోరాటాలు చేసినా కూడా ముఖ్యమంత్రి అమలు చేయటం లేదని తెలిపారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాల పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని, కలెక్టర్ జోక్యం చేసుకొని వరంగల్, జనగామలో అమలు చేస్తున్న విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలలో కూడా కనీస వేతనం అమలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్య్టూ జిల్లా నాయకులు ఎన్.సంజరు, పి.సతీష్, సిఐటియూ నాయకులు డి.వీరన్న, ఏఐటియూసీ నాయకులు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.