Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, ప్రగతిశీల కవి కుందుర్తి ఆంజనేయులు వచన కవిత్వానికి తొలి సోపానం అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమిషనర్ కళాశాల విద్య, రాష్ట్రీయ ఉన్నత శిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా అధ్యక్షతన 'వచన కవితా పితామహుడు కుందుర్తి' అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం ముగింపు సందర్భంగా ముఖ్యోపన్యాసం చేశారు. ఆధునిక కవిత్వంలో ఆదర్శం కుందుర్తి అని పేర్కొన్నారు. కొత్తగా కవిత్వంలోకి వచ్చేవారు కుందుర్తిని తప్పక చదవాలన్నారు. మొదటగా సదస్సు ఏర్పాటు చేసిన ఖమ్మం కళాశాల నిర్వాహకులను అభినందించారు. కుందుర్తికి ఘనంగా సదస్సు జరగడం అభినందనీయమన్నారు. సాహిత్యంలో ఖమ్మానికి ప్రత్యేక చరిత్ర ఉందని టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. సీతారాం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగడం చారిత్రక ఘటన అన్నారు. సీనియర్ పాత్రికేయులు ప్రసేన్ రచించిన 'సిక్ట్సీ పూర్తి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సు ఏర్పాటు చేసిన తెలుగు విభాగానికి కళాశాల పాలకమండలి సభ్యులు రవిమారుత్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యక్షుడు డాక్టర్ జే రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వెంకటేశ్వరరెడ్డి, కెఎన్ఎస్ రత్నప్రసాద్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.గోపి, మువ్వా శ్రీనివాసరావు, కోటా అప్పిరెడ్డి తదితరులు పాల్గన్నారు. ఇబ్రహీంనిర్గుణ్కు ప్రీవర్స్ఫ్రంట్ అవార్డు బహుకరించారు.