Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ 433, బైపీసీ 426, 392, 383, సీఈసీ 430, హెచ్చీసీ 394, 384 మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను ప్రిన్సిపాల్ నవీన జ్యోతి, స్టాప్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నవీన జ్యోతి మాట్లాడుతూ..పస్ట్ ఇయర్లో మొత్తం 86 మంది పరీక్షలు రాయగా 82 మంది ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. పస్ట్ ఇయర్ ఫలితాలను మించి సెకండ్ ఇయర్లో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు.